సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల రద్దు.. నీటిపారుదల శాఖలో దుమారం! తెలంగాణలో నీటిపారుదల శాఖ నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ఎత్తిపోతల పథకంలో రూ.1074 కోట్ల వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లు పిలవడం కలకలం రేపింది. By srinivas 05 Nov 2024 | నవీకరించబడింది పై 05 Nov 2024 20:10 IST in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Sitarama Project: తెలంగాణలో నీటిపారుదల శాఖ నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. సీతారామ ఎత్తిపోతల టెండర్లలోని అక్రమాలు ఇరిగేషన్ శాఖను కుదిపేస్తున్నాయి. ఆర్థికపరమైన అనుమతి లేకుండా వెయ్యి కోట్లతో చేపట్టిన ఈ టెండర్లు ఎవరి మెడకు చుట్టుకుంటాయన్న బెంగ ఇంజినీర్లను కుంగదీస్తోంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల టెండర్లపై వివాదాలు రేగుతుండగా.. పాలనాపరమైన, ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే పనులు జరిగాయన్న దుమారం రేగుతోంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ కమిటీ ఆమోదముద్ర లేని ఈ పనులు రద్దయ్యే అవకాశం ఉందనే ప్రచారం సైతం ఊపందుకుంది. రూ.10 కోట్లు పైబడి విలువ చేసే పనుల టెండర్ల ఖరారుకు సీవోటీ కమిటీ ఆమోదం అవసరముండగా.. సాంకేతిక, పాలనాపరమైన, ఆర్థికపరమైన అనుమతులు ఉంటేనే పనులకు సీవోటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రూ.1842 కోట్ల అంచనాలతో టెండర్లు.. ఈ మేరకు సీతారామ ఎత్తిపోతల పనుల్లో ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నీళ్లొదిలారనే వివాదం తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఎత్తిపోతల నిర్మాణానికి రూ.1842 కోట్ల అంచనాలతో అధికారులు టెండర్లు ఆహ్వానించగా.. ఇందులో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మిగతా రూ.1074 కోట్ల విలువైన పనులకు సంబంధించిన అనుమతులను ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టింది. అందువల్లే ఇరిగేషన్ శాఖ పాలనా పరమైన అనుమతులు జారీ చేయలేకపోయింది. కొత్తగూడెం సీఈ నేతృత్వంలో సీతారామ ఎత్తిపోతల టెండర్లపై మంత్రుల ఎదుటే నిలదీసిన సీఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీతారామ టెండర్లకు సీవోటీ కమిటీ ఆమోదం లేదంటూ ఇంజినీర్లు కుండబద్దలు కొట్టారు. ఎవరి అండతో సీఈ రెచ్చిపోతున్నారు.. కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు టెండర్లు పిలవడం విమర్శలకు దారితీసింది. ఈ టెండర్లపై నిలదీసిన ఈఎన్‌సీపై.. కొత్తగూడెం సీఈ రెండుసార్లు ఏకవచనంతో విమర్శలు చేయడం సంచలనం సృష్టించింది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ఎదుటే ఆయన రెచ్చిపోవడం మరింత దుమారం రేపుతోంది. ఎవరి అండతో సీఈ రెచ్చిపోతున్నారన్న అంశం ఇరిగేషన్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. అది వేరే విషయమైనప్పటికీ...ఎలాంటి అనుమతులు లేని.. ఈ టెండర్లకు సీవోటీ కమిటీ ఆమోదం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక శాఖ అనుమతులు లభించకపోతే కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అనుమతి లేని సీతారామ టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. #telangana #sitarama-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి