/rtv/media/media_files/2025/05/01/DVMZI1UiQewyh3c4Exds.jpg)
10TH class student died before result health issue
10th Result: పదో తరగతిలో టాపర్ గా నిలిచింది. కానీ ఆ తల్లిదండ్రులకు గుండె కోతనే మిగిలింది. తమ సంతోషాన్ని పంచుకునేందుకు కూతురే లేకపోయింది. పరీక్షలు రాసిన కొద్దిరోజులకే కూతురు ప్రాణాలు విడిచింది. టాపర్గా నిలిచిన కూతురు సంతోషాన్ని కళ్లారా చూడలేని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాద ఘటన సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది...
అయితే మల్లాపూర్ లో నివాసం ఉంటున్న ఆకుల రవి, రజిత దంపతుల కూతురు నాగచైతన్య పదో తరగతి పరీక్షలు రాసిన కొద్దిరోజులకే అనారోగ్యంతో మరణించింది. కాగా, నిన్న పదవ తరగతి ఫలితాలు విడుదల చేయగా.. అందులో చైతన్య 510 మార్కులతో స్థానిక Govt స్కూల్ టాపర్ గా నిలిచింది. కానీ ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కూతురే లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెపగిలేలా ఏడుస్తున్నారు. ఈ బాధాకరమైన ఘటన ఆ తల్లిదండ్రులను మాత్రమే కాదు విన్న ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది.