రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు విదేశాల్లో పర్యటిస్తూ కొత్త కొత్త కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఇంకొన్ని కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!
తాజాగా మరో ఇంటర్నేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. షూఆల్స్ కొరియన్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ కంపెనీ మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అలాంటి ఈ కంపెనీ ఇప్పుడు తెలంగాణాలో పెట్టుబడులు పెడుతుందంటే వేల మందికి ఉద్యోగవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!
87 వేల మందికి ఉద్యోగవకాశాలు
ఇందులో భాగంగానే షూఆల్స్ కంపెనీ ఛైర్మన్ చెవోంగ్ లీ అండ్ కంపెనీ ప్రతినిధులు కలిసి తెలంగాణ ఐటీమంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ మేరకు షూఆల్స్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ..300 కోట్లతో స్మార్ట్ షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని మంత్రిని కోరారు. దీని ద్వారా దాదాపు 87 వేల మందికి ఉద్యోగవకాశాలు దక్కుతాయని అన్నారు. ఇందులో భాగంగా గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి ముందు పెట్టారు.
ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!
‘‘షూ అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్‌తో బూట్లు తయారు చేస్తాం.. పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఈ స్మార్ట్ షూ ద్వారా ఉపశమనం కలుగుతుంది’’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు..
దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. షూ కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేసి.. ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు.. ప్రపంచ మార్కెట్లకు ఈ షూలను సరఫరా చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ ఒక హబ్‌గా చేస్తామని పేర్కొన్నారు.