Thorrur Municipality : తొర్రూరులో హై టెన్షన్..  మాజీ మంత్రి అరెస్ట్!

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

New Update
satyavati

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తొర్రూరులోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి, ఆమెను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను గృహనిర్బంధం చేయడంపై సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. "ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్ష నేతల గొంతు నొక్కుతోంది. మెజారిటీ లేకనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికను వాయిదా వేయించింది" అని ఆమె విమర్శించారు.

తొర్రూరులోని మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు తమ ఎక్స్‌ అఫీషియో ఓట్లను తొర్రూరులో నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం కూడా 9కి పెరిగింది. దీంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి.

144 సెక్షన్ అమలు

సోమవారం ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగానే.. ఎంపీ కడియం కావ్యకు ఇక్కడ ఓటు హక్కు లేదని, ఆమె గతంలో వరంగల్ కార్పొరేషన్‌లో ఓటు వేశారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరగడంతో అధికారులు ఎన్నికను నేటికి  వాయిదా వేశారు. తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎన్నిక నేడు జరుగుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు