Kadiyam Srihari : అనర్హత నుంచి సేఫ్.. స్పీకర్ ముందు కడియం ఊహించని ట్విస్ట్.. నేడు ఏం జరిగిందంటే?

కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద వేసిన అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీహరిని వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్‌ చేశారు. అయితే శ్రీహరి మాత్రం తను పార్టీ మారినట్లు చేస్తున్న ఆరోపణ నిజం కాదని వాదించారు.

New Update
FotoJet (12)

kadiya srihari vs vivekananda

Kadiyam Srihari : తెలంగాణ రాజకీయాల్లో గత రెండేళ్లుగా నానుతూ వస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ కొనసాగుతూనే ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిననట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్‌ మాత్రం 8మందికి క్లీన్‌చిట్‌ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. కాగా మరో ఇద్దరు ఎమ్మె్ల్యేల్లో దానం నాగేందర్‌ విచారణకు డుమ్మా కొట్టగా,  స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ స్పీకర్ విచారణకు హాజరయ్యారు. అయితే అనర్హత నుంచి తప్పించుకోవడానికి శ్రీహరి కొత్త వాదనకు తెరలేపడం గమనార్హం.

కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనర్హత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై ఈరోజు స్పీకర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీహరిని వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్‌ చేశారు. అయితే ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ తను పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణ నిజం కాదని వాదించారు. తను పార్టీ మారినట్లు  AI ఫోటోలు,వీడియోలు సృష్టించారని ఆయన స్పీకర్‌ ముందు వెల్లడించడం గమనార్హం. తను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, ఏఐ సహాయంతో తన మెడలో కండువాలు వేసి పార్టీ మారినట్లు ప్రచారం చేస్తు్న్నారని ఆయన ఆరోపించారు. తను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు ట్విస్ట్‌ ఇచ్చారు. 

కాగా ఈ విషయమై వివేకానంద ఘాటు వ్యాఖ్యలు చేశారు.-- విచారణలో కడియం చెప్పినవన్నీ అబద్ధాలంటూ వివేకానంద ఫైర్ అయ్యారు. -- స్పీకర్ ముందు కడియం వింత వాదన చేస్తున్నాడన్నారు, -- కాంగ్రెస్ లో చేరినట్టు వచ్చిన వీడియోలు, ఫోటోలు...AI ఫోటోలు,వీడియోలు అంటున్నాడు.  బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ సిగ్గులేకుండా ..-- పచ్చి అబద్దాలు చెబుతున్నాడని - వివేకానంద ఆరోపించారు.-- పార్టీ మారినట్టు వచ్చిన కథనాలు అన్ని తప్పుడు కథనాలే అని కడింయ అంటున్నాడని - వివేకానంద వెల్లడించారు. రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు కూడా ఏఐ ఫోటోలేనని చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. రాజకీయంగా కడియం శ్రీహరి సమాధి కాక తప్పదని వివేకా హెచ్చరించారు.

కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. -- ఇప్పటికే పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ క్లీన్‌చిట్ ఇవ్వగా -- కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ నిర్ణయంపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే నిన్నటి విచారణకు దానం నాగేందర్ గౌర్హాజరు అయ్యారు. దీంతో ఆయనకు సంబంధించిన పిటిషన్‍‍పై తదుపరి విచారణ మార్చి2కు స్పీకర్ వాయిదా వేశారు. ఇక ఇవాళ కడియం శ్రీహరి విచారణ పూర్తయింది. మార్చి మొదటి వారంలో దానం నాగేందర్‍పై దాఖలైన పిటిషన్ పై విచారణ పూర్తి చేసి వీరిద్ధరికి సంబంధించిన పిటిషన్లపై తీర్పు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు