New Update
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో పోలింగ్ ముగిసింది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు RTV సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్‌ఎస్ 23, బీజేపీ 5, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో నివేదించింది.
తాజా కథనాలు
Follow Us