Komatireddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే.

New Update
komatireddy (1)

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4నుంచి రాత్రి 9వరకే మద్యం దుకాణాలు తెరవాలని..పర్మిట్ రూమ్‌లు పెట్టొద్దని రాజగోపాల్ కండిషన్స్ పెట్టారు. వైన్ షాపులను ఊరికి దూరంగా, లేదా ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలి. ఊరి మధ్యలో అనుమతి లేదన్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఎవరూ సిండికేట్‌గా మారి అధిక ధరలకు అమ్మడం లేదా డూప్లికేట్ మద్యం అమ్మడం వంటివి చేయకూడదన్న నింబధనను తీసుకువచ్చారు.  ఈ నిబంధనలను పాటించకపోతే దుకాణాలు నడవనివ్వనని ఆయన వ్యాపారులను హెచ్చరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పాలసీలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు రాజగోపాల్ రెడ్డి. 

దీంతో మునుగోడులో టెండర్లు వేయడానికి భయపడి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి వద్దకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై స్పందిస్తూ, రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదు, అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై, ప్రభుత్వం అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

తనదైన దూకుడు శైలితో

2009లో కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనదైన దూకుడు శైలితో తెలంగాణ పాలిటిక్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా.. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. అనంతరం మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2018లో విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీతోనే కేసీఆర్ ను ఓడించడం సాధ్యమంటూ ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు.

హోరాహోరీగా సాగిన ఆ ఉప ఎన్నికలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖర్చు జరిగిన నియోజకవర్గంగా మునుగోడు నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవిని ఆశించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే.. విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రేవంత్ కు పంటి కింద రాయిలా మారారు రాజగోపాల్ రెడ్డి. 

Advertisment
తాజా కథనాలు