ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సైబర్ కేటుగాల్లు సంపన్నులనే టార్గెట్ చేస్తున్నారు. ఫోన్లకు లింకులు పంపించి డబ్బులు దోచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ వ్యవహారం అధికమైపోయింది. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. షేర్లలో పెట్టుబడుల పేరిట సైబర్ నేరస్థులు కోట్లలో దోచేశారు. ఓ వ్యక్తికి లింకు పంపించి అది క్లిక్ చేయగానే.. ట్రేడింగ్ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకున్నారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. అనంతరం డబ్బులు కూడా విత్‌డ్రా చేసుకునేలా చేశారు. అలా చేస్తూ బాధితుడి నుంచి దాదాపు రూ.8 కోట్ల వరకు కొట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!
మెలానీ లయన్స్ - ఎస్‌ఐజీ గ్రూపు పేరుతో లింక్
హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఇంజినీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్‌కు మెలానీ లయన్స్ - ఎస్‌ఐజీ అనే గ్రూపు నిర్వహకుల పేరుతో లింక్ వచ్చింది. ఆ బాధితుడు లింక్‌ను క్లిక్ చేసి ‘ఎస్ఐజీ ట్రేడింగ్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. అయితే మొదటిగా షేర్ మార్కెట్ బ్లాక్ ట్రేడ్, ఐపీఓల గురించి బాధితుడికి కొంత సమాచారాన్ని అందించారు. ఆపై 20 రోజుల తర్వాత బాధితుడిని ‘ఆర్‌కే గ్లోబల్’ అనే యాప్‌లో చేర్పించారు.
భారీగా లాభాలు పొందొచ్చని నమ్మించారు
ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు
అనంతరం ‘ఈ26-ఆర్‌కే’ అనే మరో గ్రూప్‌లోకి మార్చారు. అందులో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేలా బాధితుడిని ప్రోత్సహించారు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఐపీవోలు పొందేలా చేస్తామని నమ్మించారు. దాని ద్వారా భారీగా లాభాలు పొందొచ్చని అన్నారు. దీంతో నిజమేనని నమ్మిన బాధితుడు ఆర్‌కే గ్లోబల్ యాప్ ద్వారా వివిధ బ్యాంక్ ఖాతాలకు ఆన్‌లైన్‌లో అమౌంట్ ట్రాన్సఫర్ చేశాడు.
రూ.కోట్లలో లాభాలొచ్చినట్లు
ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?
అయితే ఆ ఆర్‌కే బ్యాంక్ ఖాతాలో పెట్టిన పెట్టుబడికి రూ.కోట్లలో లాభాలొచ్చినట్లు డీమ్యాట్ ఖాతాలో కనిపించాయి. అంతేకాదు అందులోంచి బాధితుడు రూ.2 వేలు విత్‌డ్రా చేసుకున్నాడు. దీంతో ఇంకాస్త నమ్మకం వచ్చింది. అలా మరికొన్ని సార్లు ఆ బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ ట్రాన్సఫర్ చేసి.. మరికొంత సొమ్మును విత్ డ్రా చేశాడు. అయితే విత్ డ్రా చేసిన అమౌంట్ మాత్రం యాప్‌లో కనిపించాయి కానీ.. బాధితుడి అకౌంట్‌కి జమ కాలేదు. దీంతో ఆ బ్యాంక్ కస్టమర్‌కేర్‌ను సంప్రదించాడు.
రూ.8.15 కోట్లు కొట్టేశారు
అయితే అప్పటికే బాధితుడి ఆర్‌కే ఖాతాలో రూ.37.5 కోట్లు కనిపిస్తోంది. ఇక ఆ నగదు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే 2 శాతం చెల్లించాలని కేటుగాల్లు చేప్పడంతో దాదాపు రూ.75 లక్షలు చెల్లించాడు. అలాగే సెబీ తనిఖీ పేరుతో మరో రూ.2 కోట్లు చెల్లించాలని చెప్పడంతో.. బాధితుడు అంత చెల్లించలేనని తెలిపాడు. దీంతో కేటుగాల్లు రూ.1.25 కోట్లు రుణంగా ఇస్తామంటూ నమ్మించారు.
ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా
అనంతరం బాధితుడు మిగిలిన రూ.75 లక్షలు పంపించాడు. అలా మొత్తం బాధితుడి నుంచి రూ.8.15 కోట్లు కొట్టేశారు. అప్పటికైనా తన ఆర్‌కే యాప్‌లో ఉన్న మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలనుకున్నాడు. కానీ విత్ చేస్తున్న క్రమంలో కస్టమర్‌కేర్ వారు మరో రూ.50.6 లక్షలు జమ చేయమని చెప్పారు. దీంతో ఇదంతా మోసంమని.. తాను మోసపోయినట్లు బాధితుడు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)లో కేసు నమోదైంది.