/rtv/media/media_files/2025/09/25/smita-sabarwal-2025-09-25-12-23-57.jpg)
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు స్మిత సబర్వాల్. కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలంటూ పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు తనకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని
ఇదిలాఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని రేవంత్ సర్కార్ దీనిపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి సీఎం ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం నిర్మాణాలకు సంబంధించి స్మితా సబర్వాల్ రివ్యూ చేసిందని కమిషన్ పేర్కొంది. ఆమె బ్యారేజ్‌లను సందర్శించిన పలు ఫొటోలను కూడా పొందుపర్చింది.
సీఎం ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో స్మీతా సబర్వాల్ పలు సందర్భాల్లో మూడు బ్యారేజీలను సందర్శించారని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్మినిస్ట్రేటిన్ పర్మిషన్లు జారీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు తనకు 8b,8c నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రిపోర్టును క్వాష్ చేయాలంటూ కోరారు.