/rtv/media/media_files/2026/03/04/fotojet-3-2026-03-04-17-42-46.jpg)
Vem Narender Reddy, Dommati Sambaiah
Rajya Sabha elections : తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వివిధ సామాజిక వర్గాల నుంచి 16 మంది పోటీలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. అందులో దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రోజు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం ఈ రోజు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎఐసీసీ తెలంగాణ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అందరి ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీఖార్జున్ ఖర్గే సూచించినట్లు తెలిపారు.
కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాగా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు. ఇక పరకాలకు చెందిన దొమ్మాటి సాంబయ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి వారిద్దరినీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Follow Us