/rtv/media/media_files/2026/03/07/fotojet-34-2026-03-07-12-04-01.jpg)
Gaddar Awards
Gaddar Awards : 2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి నిలవగా ఉత్తమ నటుడిగా తండేల్ సినిమాకు గాను నాగ చైతన్య, ఉత్తమ నటిగా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన్న ఎంపికయ్యారు. వివరాల ప్రకారం...
ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా. ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్ షో ,నేషనల్ ఇంటిగ్రిటీ సినిమాగా - తండేల్, ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ - లిటిల్ హార్డ్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా- సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం - కోర్టు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ, - మిరాయ్,ఉత్తమ బాలల చిత్రంగా అనగనగనా ఎంపికయ్యాయి.
ఇక వ్యక్తిగత క్యాటగిరిలో ఉత్తమ దర్శకుడిగా రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి గాను సాయిలు ఎంపికయ్యారు. ఉత్తమ సపోర్టింగ్ నటుడుగా దండోరా చిత్రానికి -శివాజీకి, ఉత్తమ సపోర్టింగ్ నటి- భూమికకు అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడు గా -మార్క్ కె రాబిన్ (దండోరా),ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ నేపథ్య గాయని -సాహితి చాగంటి (కన్నప్ప), ఉత్తమ హాస్యనటుడు కృష్ణ తేజ (జిగ్రీస్), ఉత్తమ బాలనటుడు రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో), ఉత్తమ కథా రచయిత గుణశేఖర్ (యుఫోరియా),ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గాఅనిల్ రావిపూడికి అవార్డు దక్కింది.
ఇక ఉత్తమ గేయ రచయితగా నందకిశోర్ (కుబేర), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్),ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్‌గా (మిరాయ్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి), ఉత్తమ కొరియోగ్రాఫర్ ఆట సందిప్ (గిర గిర గిర), ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ -తోట తరణి (ఛాంపియన్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవింద్ (అఖండ), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ -చంద్రకాంత్(చాంపియన్ ). ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ - (23), స్పేషల్ జూరీ మేల్‌యాక్టర్ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు),స్పెషల్ జ్యూరీ హీరో - రోషన్ (చాంపియన్)గా ఎంపికయ్యారు.
Follow Us