Rajiv Park : గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు. ఆ భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని,బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ లను  ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.  

New Update

కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు.  కంచ గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ లను  ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.  ప్రభుత్వ భూమి 400 ఎకరాలతో పాటు HCU కు సంబంధించి మరో 1600 ఎకరాలు సేకరించి.. మొత్తం 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్కే తలమానికంగా నిర్మాణం ఉండేలా ప్లాన్ చేయాలని...  దీనికి రాజీవ్ పార్క్గా నామకరణం చేయాలని ప్రతిపాదించారు.  

ప్రస్తుతం HCU లో 1500 ఎకరాల భూమి ఉంది. కాగా కంచ గచ్చిబౌలి భూములపై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తుండగా.. ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూమి అంశంపై స్పష్టత తీసుకురావటానికి.. ప్రభుత్వం మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.  ఈ త్రిసభ్య కమిటీ  HCU అధికారులు, విద్యార్థులు,  ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

కేటీఆర్ ఇప్పటికే సంచలన ప్రకటన

కాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనద్దని కోరారు.  ఒకవేళ కొన్నా తాము అధికారంలోకి రాగానే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు.   ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా నష్టపోతారని చెప్పారు. మూడేళ్లలో తాము అధికారంలోకి రాగానే  HCUకి చెందిన 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తామని అన్నారు.  ఈ క్రమంలో ప్రభుత్వమే అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచించడం చర్చనీయాంశంగా  మారింది. 

Also read :  అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు