మణిపూర్‌లో ముగ్గురు పిల్లల తల్లిపై అత్యాచారం.. అనంతరం సజీవ దహనం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు. By Vijaya Nimma 09 Nov 2024 in నేషనల్ క్రైం New Update Manipur షేర్ చేయండి Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ స్కూల్ టీచర్‌పై హ్మార్ తెగకు చెందిన దుండగులు అత్యాచారం చేసి సజీవ దహనం చేయడం అందరినీ కలచివేస్తోంది. ఘటనకు పాల్పడింది మైతీ జాతీయులుగా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని స్థానిక సంస్థలు స్వాధీనం: జిరిబామ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కాలిపోయిన స్థితిలో ఉన్న 31 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్థానిక సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు ప్రతీగా మహిళకు చెందిన తెగ వాళ్లు మరో వర్గంపై కాల్పులు జరపడంతో పాటు పలు ఇళ్లను ధ్వంసం చేశారు. ఇది కూడా చదవండి: రెగ్యులర్‌గా బ్రష్ చేయకపోతే మీ దంతాల పని అంతే అయితే ఘటనపై పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. బాధితురాలి డెడ్‌బాడీకి పక్క రాష్ట్రం అసోంలోని సిల్చార్‌లో పంచనామా నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ మేజిస్ట్రేట్‌కు ఎస్పీ లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: అసలు ఎక్స్-రే అనేది ఎలా మొదలైంది? #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి