మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. పొంగులేటిని ఆయన కొడుకు హర్షారెడ్డి ఇరాకటంలో పెట్టాడు. ఇటీవలే హర్షారెడ్డి ఖరీదైన వాచ్‌లను స్మగ్లర్ల ద్వారా తెప్పించారు. కోట్లాది రూపాయల విలువైన పాటెక్ ఫిలిప్, బ్రెగ్యూట్ బ్రాండ్ లాంటి బ్రాండ్లను కొనుగోలు చేశాడు. విదేశాల నుంచి తెప్పిస్తుండగా.. ఫిబ్రవరి 5న స్మగ్లర్ అయిన మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ చెన్నై కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. విచారణలో పొంగులేటి కొడుకు హర్షా రెడ్డియే ఈ వాచ్‌లు తెప్పించినట్లు ముబీన్ అంగీకరించాడు.
ఈ వ్యవహారంలో అలోకం నవీన్ కుమార్ అనే వ్యక్తి నుంచి హవాలా, క్రిప్టో కరెన్సీ ద్వారా రూ.100 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హర్షారెడ్డి రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కో వాచ్ ధర విలువ రూ.5 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.ఈ వాచ్‌లను సన్నిహితులకు, మిత్రులకు హర్షారెడ్డి ఇచ్చినట్లు తెలుస్తోంది.