ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యే గాంధీ, తన అనుచరులను అరెస్టులు చేయాలని.. దాడులకు ప్రోత్సహించిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలని మజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేతల తరలింపులో హైడ్రామా నెలకొంది. వాళ్లని ఎటు తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పలేదు. రెండు గంటలుగా 100 కిలోమీటర్లకు పైగా రోడ్లపైనే తిప్పుతిన్నారు.
ఓ వాహనాన్ని తలకొండవల్లి వైపుకు.. మరో వాహనాన్ని కేశంపేట వైపు తిప్పుతున్నారు. దీంతో వారిని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించారు. పోలీసుల చర్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అడిగితే దాడులు చేస్తారా ? అంటూ మండిపడ్డారు. గాంధీ హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు.