బీఆర్‌ఎస్ నేతల తరలింపులో హైడ్రామా.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు 2 గంటలకు పైగా బస్సులోనే తిప్పడంతో హైడ్రామా నెలకొంది. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించారు. By B Aravind 12 Sep 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యే గాంధీ, తన అనుచరులను అరెస్టులు చేయాలని.. దాడులకు ప్రోత్సహించిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలని మజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేతల తరలింపులో హైడ్రామా నెలకొంది. వాళ్లని ఎటు తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పలేదు. రెండు గంటలుగా 100 కిలోమీటర్లకు పైగా రోడ్లపైనే తిప్పుతిన్నారు. ఓ వాహనాన్ని తలకొండవల్లి వైపుకు.. మరో వాహనాన్ని కేశంపేట వైపు తిప్పుతున్నారు. దీంతో వారిని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించారు. పోలీసుల చర్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అడిగితే దాడులు చేస్తారా ? అంటూ మండిపడ్డారు. గాంధీ హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తున్న వాహనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.#BRSparty @BRSHarish pic.twitter.com/mRsOfC0f6n — Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) September 12, 2024 కొత్తపేట వద్ద వెయ్యి మందికి పైగా బిఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని బిఆర్ఎస్ నాయకులను తరలిస్తున్న వాహనాల అడ్డగింత pic.twitter.com/qZ44kCCFUe — Telugu Scribe (@TeluguScribe) September 12, 2024 #brs #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి