/rtv/media/media_files/2026/02/14/political-heat-rises-in-mahbubnagar-mayor-seat-2026-02-14-20-23-20.jpg)
Political Heat Rises in Jangaon Mayor Seat
Municipal Elections: జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు ఇక్కడ కీలకంగా మారారు. జనగామాలో మొత్తం 30 వార్డులు ఉండగా బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్ కు 12 సీట్లు వచ్చాయి. ఇక సీపీఎం ఒకస్థానంలో గెలవగా నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవాలంటే బీఆర్ఎస్ కు 3గురు, కాంగ్రెస్‌కు నలుగురు అవసరం. దీంతో ఇండిపెండెంట్లకు డిమాండ్ పెరిగింది.ఇండిపెండెంట్లకు 2 కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే 15వ వార్డు అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ఛైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తానంటుండటంతో ఉత్కంఠ నెలకొంది.
తొర్రూరులో మారుతున్న సమీకరణలు
మరోవైపు తొర్రూరులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాకిచ్చేలా కాంగ్రెస్ పావులు కదుపుతుంది.-- BRS కౌన్సిలర్లను లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.-- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాకిచ్చేలా -- తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు యశస్విని రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టింది.-- ఒక్కో కౌన్సిలర్‌కు రూ.కోటి ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్లో గెలిచిన కొంతమంది కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం కనిపిస్తుంది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుండెల్లో గుబులు రేగుతుంది. చైర్మన్ పదవి క్లీన్ షిప్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా కోటి వరకు ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొర్రూర్ లో నాలుగు ఐదు వార్డులు టిఆర్ఎస్ నుండి గెలిచినప్పటికీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల అనుచరులు కావడంతో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక వరకు ఉత్కంఠ గా మారే అవకాశం ఉంది.. దీంతో బీఆర్ఎస్ గుండెల్లోదడ మొదలైంది.ఇక వర్ధన్నపేటలో బీఆర్ఎస్ 6 వార్డుల్లో గెలిచినప్పటికీ ఐదవ వార్డు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు రెండు పార్టీలకు 12 సీట్లతో ఈక్వల్ గా మారింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి కూడా గట్టి పారితోషకమే అందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Follow Us