Ganjai don Angur Bhai : ధూల్‌ పేట లేడీ డాన్‌కు పోలీసుల చెక్.. ఇక మీదట బయటకు రాకుండా..

మోస్ట్ వాంటెండ్.. ధూల్ పేట లేడీ డాన్ అంగూర్ భాయ్ మీద పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్‌పేట సీఐ మధుబాబు.. పీడీ జీవోను అందించారు.

New Update
 angur-bai

angur-bai

Ganjai don Angur Bhai : మోస్ట్ వాంటెండ్.. ధూల్ పేట లేడీ డాన్ అంగూర్ భాయ్ మీద పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్‌పేట సీఐ మధుబాబు.. అంగూర్ భాయ్‌కి పీడీ జీవోను అందించారు. రాష్ట్రం కానీ రాష్ట్రంలోకి వచ్చి.. తెలంగాణలోని దూల్‌పేట్‌లో స్థిరపడి.. గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ భాయ్‌పై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ యాక్ట్ ఆదేశాలు జారీ చేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులు మొత్తంగా గంజాయి వ్యాపారంలో మునిగితేలింది.

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

అరెస్ట్‌ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి, ఎలాగోలా బెయిల్ మీద వచ్చేస్తుంది. దీంతో ధూల్ పేట పోలీసులు ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు. అంగూర్‌ భాయ్‌ మీద పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అయితే.. ఇటీవలే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అంగూర్ భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్‌లో ఉంది. ఇప్పటికే చాలా సార్లు గంజాయి దందాలో అరెస్ట్ అయిన అంగూర్‌ భాయ్‌ తిరిగి బయటకు వచ్చి తన దందాను ఎదో విధంగా కొనసాగిస్తోంది. కేవలం అంగూర్ భాయ్ ఒక్కతే కాదు.. ఆమె కుటుంబం మొత్తం గంజాయ్ దందాలోనే మునిగి తేలుతుండటం గమనార్హం. దీంతో.. ఆమె కుటుంబంపై ఇప్పటికే చాలా సార్లు కేసులు పెట్టినా.. ఎదో రకంగా బెయిల్ పొంది.. బయటకు వచ్చి మళ్లీ అదే గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ భాయ్‌ మీద ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం (మార్చి 11న) పీడీ యాక్ట్ ఆదేశాలు జారీ చేశారు.  

Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు

 ఇలాంటి క్రిమినల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వివి కమల్ హాసన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ధూల్ పేట ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి పీడీ యాక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను చంచల్ గూడ జైల్లో ఉన్న అంగూర్ భాయ్‌కి ధూల్‌పేట సీఐ మధుబాబు అందించారు. అంగూరు భాయ్ మీద ఇప్పటికే.. 30 గంజాయి అమ్మకాల కేసులు ఉండటం గమనార్హం. 20 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లతో పాటు, మరో 10 సివిల్ పోలీస్ స్టేషన్లలో కూడా ఆమెపై కేసులున్నాయి. ధూల్‌పేట ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 3 కేసులు, మంగళ్‌హట్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్‌నగర్‌, గౌరారం స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయి. ఇన్ని కేసుల్లో నిందితురాలిగా ఉన్న ధూల్‌పేట గంజాయి డాన్‌ అంగూర్ భాయ్.. ఈ గలీజు దందా చేసి ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది.

Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు