ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ఈ రోజు ఈ కేసులో పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడుతూ.. పోలీసులు తనతో పాటు ఇంకా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదన్నారు. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తనకు తెలిసిన అధికారి కావడంతో గతంలో మాట్లాడానన్నారు. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లను తిరుపతన్న అడిగినట్లు చెప్పారు. వారిద్దరు ఫోన్ నంబర్లను తమ అనుచరుల నుంచి తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఇచ్చానన్నారు. ఈ నంబర్లు ఎందుకు ఆడిగావ్ అని తిరుపతన్నను ప్రశ్నించాన్నారు.
మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా..
మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తనను తిరుపతన్న అడిగాడన్నారు. ప్రచారం బాగా జరుగుతుందని తాను ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్లను తాను టాప్ చేశాననేది అవాస్తవమని లింగయ్య కొట్టి పారేశారు. మీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలనే లక్ష్యంతో కొంతమంది తనపై కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సహకరిస్తానన్నారు. తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే తనను ప్రశ్నించారన్నారు.
Also Read : పెన్నాకు గోదావరి జలాలు.. కృష్ణా మీదుగా అనుసంధానం!
Also Read : బీజేపీలో చిచ్చు పెట్టిన కేటీఆర్.. ఎంపీలు షాకింగ్ కామెంట్స్!
రాజకీయ కక్షతోనే నోటీసులు..
ఈ రోజు విచారణకు వెళ్లే ముందు చిరుమర్తి లింగయ్య ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. విచారణను ఎదుర్కొంటాన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తనపై రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు. ఈ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకే ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లాలో పనిచేసిన పోలీసు అధికారులతో మాట్లాడడం సాధారణమేనన్నారు.
Also Read : 'పుష్ప 2' కోసం రంగంలోకి రాజమౌళి.. సుకుమార్ ప్లాన్ అదుర్స్
Also Read : శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్