/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t134237-2026-01-22-13-43-35.jpg)
Jagityala..Jeevan Reddy vs. Sanjay Kumar
Jeevan Reddy : జగిత్యాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్‌కుమార్ చేరికను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు గాంధీభవన్‌లో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంపై జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక సమావేశానికి ఎలా వస్తాడంటూ సమావేశాన్ని జీవన్‌రెడ్డి బహిష్కరించారు.చాలాకాలంగా వివాదాలకు కేంద్రబిందువవుతూ కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారిన జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
పూర్వ కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లాకు చెందిన తానిపర్తి జీవన్‌రెడ్డిని స్థానికులు జగిత్యాల టైగర్ అని పిలుస్తారు..ఆయన1982కు ముందే సమితి అధ్యక్షునిగా పనిచేశారు. అంతకు ముందు జగిత్యాల కోర్టుతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా పలుకేసులు వాదించారు..1982లో.. మార్చి 29న నాటి ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో చేరారు..1983లో జగిత్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా ఎన్నికయ్యారు..1984లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కరరావుకు మద్దతుగా నిలిచి మంత్రిగా కొనసాగారు. కేవలం నెలరోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 1984లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు .
జీవన్ రెడ్డి గత రెండు సంవత్సరాల నుంచి వార్తల్లో ప్రధానంగా.. నిలుస్తున్నారు..జై బాపూ జై సంవిధాన.. జై కాంగ్రెస్..అనే నినాదంతో పోరాడుతున్నాడు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ప్రధాన పాత్ర పోషించిన జీవన్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఆయన ప్రధాన రాజకీయ శత్రువుఅయిన.. డాక్టర్ ఎం సంజయ్ కుమార్..
వీరిద్దరి మధ్య గొడవ ఏంటి ?
2014 సాధారణ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, డాక్టర్ సంజయ్ కుమార్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు ఆ సమయంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి పై డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు..అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బరిలో దిగారు. డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి పై సంజయ్ కుమార్ విజయం సాధించారు..అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనంతరం కొద్దిరోజుల్లోనే.... డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు.
ఈ కేసు కాస్త పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు లో చేర్చబడింది. ఈచట్టం కింద.. ఒక పార్టీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే ఎంపీలు మరో పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు అవుతుంది. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు కేసు వేశారు. అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి సంబంధించిన పార్టీ ఫిరాయింపులను 21 చట్టంకి సంబంధించిన అంశాన్ని తీర్పు రిజర్వుల్లో ఉంచారు..
ఇదిలా ఉంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా ఉన్న కేసీఆర్ కు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఆయన..2006,2008 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ పట్టబదుల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2023లో జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత 24 లో జరిగిన.. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు.
అయితే ప్రధానంగా దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పోరాటం చేశారు. రాజకీయంగా కాంగ్రెస్ కార్యకర్తలను నేతలను అవమానపరిచారు. తప్పుడు కేసుల్లో ఇరికించారు ఇబ్బందులకు గురి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గంలో పెత్తానం చెలాయించడమేంటి అని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు..జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో మద్దతు దారుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా చీలిపోయారు.
దీంతో..డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి ఆయన మద్దతు దారులు అనేక సందర్భాలలో నిరసనలకు దిగారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని సముదాయించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలను పంపించారు. వారు సముదాయించారు అయినా ఆయన అలక, ఆగ్రహం వీడలేదు. తాజాగా పంచాయతీరాజ్ సర్పంచ్ ఎన్నికలలో సైతం ఎవరి అనుచరులు ఎక్కువమంది తమ నియోజకవర్గంలోని గ్రామాల్లో సర్పంచులుగా గెలిచారు అనేదానిపై చర్చ జరిగింది.
ఆ మధ్య జీవన్ రెడ్డి అనుచరుల జాబితాలో ఉన్న మాజీ సర్పంచ్ హత్య సందర్భంగా స్వయంగా జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేనే ఈ హత్య చేయించాడని తీవ్ర ఆరోపణ చేస్తూ ధర్నా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ సీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న నాయకులతో హైదరాబాద్ గాంధీభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కొద్దిసేపట్లోనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సైతం సమావేశానికి వచ్చాడు. అయితే మీరు అతన్ని ఎలా పిలుస్తారు. పక్క పక్కన ఎలా కూర్చోవాలనిపిస్తుంది .కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తనకు అవమానంగా ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఉందని తీవ్ర ఆగ్రహంతో ఆయన బయటకు వెళ్లిపోయారు.
కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లో ఉంది. దాన్ని కచ్చితంగా అమలు చేయాలని జీవన్ కోరుతున్నారు. అధికారం ముఖ్యం కాదు రాజ్యాంగ విలువలు ఆత్మగౌరవం ముఖ్యమని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా సైతం పిలుపునిచ్చిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.. గతంలో ఓటు చోరీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తదితరులు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన కార్యకర్తల.. నాయకుల సమావేశంలో.. జీవన్ రెడ్డి ఆయన అనుచరులు ఓటు చోరీ సరే ముందు జగిత్యాలలో కూర్చి చోరీ అయింది గద్దె చోరీ అయింది దీని సంగతి ఏంటి అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
కాగా, జీవన్ రెడ్డి అతని అనుచరులు ఒకటే ఆశిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గం లో అనేక ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు, తమను ఇబ్బంది పెట్టిన వ్యక్తి మరొకసారి ఈవైపు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఏ దిశకు మల్లుతాయి అనే చర్చ జరుగుతుంది ఈ వ్యవహారం కాస్త మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు ముఖ్యమంత్రి రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనడంలో సందేహం లేదు.
Follow Us