TS: ఈవీ వాహనాలకు ఫీజు మినహాయింపు–పొన్నం

తెలంగాణలో ఈవీ వెహికల్స్ కోసం కొత్త విధానాలను తీసుకువచ్చారు. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నామని రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జీవో 41 ద్వారా ఈ పాలసీని అమలు చేస్తున్నారు. 

New Update
Ponnam Prabhakar

No registration Fee: 

తెలంగాణలో రేపటి నుంచే కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని ప్రకటించారు రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని తెలిపారు. ఈవీ వెహికల్స్‌ను మరింత ప్రోత్సహించాలనుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం చెప్పారు. దీని ప్రకారం ఈవీలను కొన్నవారికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. ఈ పాలసీ రేపటి నుంచి  2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని మంత్రి చెప్పారు. జీవో ప్రకారం.. ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు వందశాతం పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఉంటుందని మంత్రి తెలిపారు. 

Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

Also Read : పెళ్ళికి రెడీ అయిన కీర్తి సురేష్.. గోవాలో వెడ్డింగ్, అబ్బాయి ఎవరంటే?

ఇక హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెడుతన్నామని తెలిపారు మంత్రి పొన్నం. ఢిల్లీలా హైదరాబాద్ కాకూడదని..అందుకే ఎయిర్ పొల్యూషన్‌ను నియంత్రించాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ కొత్తవిధానల వలన ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతాయని చెప్పారు. ఈ క్రమంలో.. ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

Also Read: ఆవు పేడలో నోట్ల కట్టలు.. పని చేసే ఆఫీసుకే కన్నం వేసిన ఓ దొంగ చేశాడంటే?

Also Read: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆప్‌కు మంత్రి రాజీనామా

Advertisment
Advertisment
తాజా కథనాలు