Mahesh Kumar Goud : కవితకు కాంగ్రెస్ పార్టీ లో నో ఎంట్రీ.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతుందని జరుగుతున్న ప్రచారం పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ  కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

New Update
FotoJet - 2026-01-13T174616.505

No entry for Kavitha in the Congress party

Mahesh Kumar Goud :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతుందని జరుగుతున్న ప్రచారం పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంగళవారం నాడు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ  కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాగా కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత ఆరోపణలు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ నుంచి సమాధానం లేదన్నారు.  కవిత మాటలతో కేసీఆర్ కుటుంబం అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. అందువల్ల బీఆర్‌ఎస్‌ ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజలు  అవినీతిని అక్రమాలను అంగీకరించరన్నారు.

తెలంగాణలో బీజేపీని నమ్మె పరిస్థితి లేదన్న మహేశ్‌కుమార్‌ ఇక్కడ మత రాజకీయాలు నడవవని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రభావం చూపించే స్థితి లేదన్నారు.  బీజేపీ హిందూ సెంటిమెంట్ తో ఎన్నిసార్లు ప్రజల మద్దతు పొందగలదని ఆయన ప్రశ్నించారు.దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందని ఇది మంచి పద్దతి కాదన్నారు. రాముడికి, బీజేపీకి సంబంధమేంటి అని ఆయన ప్రశ్నించారు. తాము హిందూ ఆచారాలను పాటిస్తామని.. కానీ హిందూ సెంటిమెంట్‌తో ఓట్లు అడగమని తెలిపారు.  పీసీసీ చీఫ్. మంత్రులకు, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేశ్ తేల్చిచెప్పారు. ఇతర మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి తలదూర్చరన్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని వెల్లడించారు. డీ సెంట్రలైజేషన్ కోసమే మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని పీసీసీ చీఫ్ తెలిపారు.

మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్న మహేష్‌ కుమార్‌ ప్రజల అవసరాలకు తగ్గట్లు మా ప్రజా ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. మొదటిసారి హైదరాబాద్ బయట కాబినెట్ మీటింగ్ పెట్టడం శుభ పరిణామమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూస్తామని, కాంగ్రెస్ పార్టీలో నేను ....అన్న... పదానికి విలువ లేదన్నారు. జిల్లాల విభజన బీ ఆర్ ఎస్ అశాస్త్రీయంగా చేసిందని, ఇప్పుడు  కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు చేర్పులు చేయాలని మా సీఎం భావిస్తున్నారన్నారు. జిల్లాలను తీసెయ్యాలన్న ఆలోచన మాకు లేదన్నారు. భూభారతి లో అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే ఇవ్వండి చర్యలు తీసుకుంటామన్నారు.కార్పొరేషన్ చైర్మన్ల ఫోస్టులను భర్తీ చేస్తామని , పదవులు తక్కువ ఉన్నాయి  డిమాండ్ అధికంగా ఉందన్నారు. పార్టీ మారిన నియోజక వర్గాల్లో పార్టీ నాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణా ప్రయోజనాలే ముఖ్యమని.. ఒక్క నీటిబొట్టును కూడా వదలమని తేల్చిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ తరఫున ఒక కమిటీ వేస్తామని.. సర్వేల ఆధారంగా టికెట్ల ఇస్తామని చెప్పారు. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాయడం సరికాదన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు.తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు  ఉంటాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

#kalvakuntla-kavitha #chit-chat-with-media #TPCC Chief Mahesh Kumar Goud #Telangana Jagruthi #tpcc mahesh kumar goud
Advertisment
తాజా కథనాలు