Car Accident: నిజామాబాద్ లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, విద్యార్థినిలకు గాయాలు!
నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్లూర్ మండలం దాస్నగర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి.