Nizamabad Incident: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు స్కూల్ గర్ల్స్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. నవీపేట్ లోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న శిరీష, వరలక్ష్మీ, రవళి అనే అమ్మాయిలు కనిపించకుండా పోయారు. రోజూలానే స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ముగ్గురు స్తూడెంట్స్ రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Armaan Malik: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్