/rtv/media/media_files/2025/10/17/naveen-yadav-2025-10-17-21-28-52.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నువ్వా నేనా అన్నట్టూగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు. చీటింగ్, నమ్మక ద్రోహం మరియు ఎన్నికల లంచం సహా 7 FIRలు నవీన్ యాదవ్‌పై నమోదయ్యాయి. BRS పాలనలో 2021లో 5 కేసులు, 2006 ఓ కేసు, 2025లో 1 కేసు నమోదయ్యాయి.
Rs30.3cr assets, 7criminal cases, Bachelor of Architecture degree - declares Naveen Yadav - Congress Jubilee Hills Bypoll candidate
— Naveena (@TheNaveena) October 17, 2025
Education - Bachelor of Architecture – CSIIT Begumpet, JNTU (2007)
Assets in His Name - ₹30.30cr
Movable - ₹63,87,813
Immovable -… pic.twitter.com/P8Y6UzvfaJ
అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలు తెలియజేశారు. నవీన్ యాదవ్ మొత్తం ఆస్తుల విలువ రూ.30.3 కోట్లు. అలాగే ఆయనపై 7 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 2007లో నవీన్ యాదవ్ JNTU నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీ పట్టా పొందినట్లు- అఫిడవిట్‌లో సమర్పించారు. అందులో రూ.63,87,813 లక్షలు చరాస్తులు, రూ.29,66,39,250 స్థిరాస్తులు. రూ.75 లక్షలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాధ్యత కలిగి ఉన్నారు. అలాగే ఆయన భార్య- వర్ష యాదవ్ పేరు మీద- రూ.8.25 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కొడుకు రూ.19.31 లక్షల ఆస్తులు కలిగిఉన్నాడు.