BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి!

హుజూర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కీలక నేత కస్తాల శ్రవణ్‌ చనిపోయారు. మంత్రి ఉత్తమ్ శ్రవణ్ మృతదేహంపై కాంగ్రెస్ జెండా ఉంచి నివాళులర్పించారు. బాధితుడి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానని.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

New Update
Uttam Kumar Reddy

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్‌ మరణించారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హుజూర్ నగర్ వెళ్లారు. శ్రవణ్‌ మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతుల పిల్లల చదువుకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని.. ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిన్న రాత్రి హుజూర్‌నగర్ కోర్టు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఖమ్మంకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. అయితే.. తలకు బలమైన గాయం కావడంతోనే శ్రవణ్ మరణించినట్లు తెలుస్తోంది.

స్టూడెంట్ యూనియన్, ఎమ్మార్పీఎస్ నేతగా పని చేసిన శ్రవణ్.. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రవణ్‌ కాంగ్రెస్ ఫ్లోర్‌ లీడర్‌గా నియమితులయ్యారు. 

Advertisment
తాజా కథనాలు