Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!

మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా..ఇంకా 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు.

hydra
New Update

Musi : దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో గత పది రోజులుగా కూల్చివేతలకు బ్రేక్‌ ఇచ్చిన ప్రభుత్వం రేపటి నుంచి మళ్లీ పనులు మొదలు పెట్టనుంది. మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఇళ్లకు ఇప్పటికే అధికారులు మార్కింగ్‌ చేశారు. దాదాపు 150 ఇళ్లను సైతం కూల్చివేశారు కూడా. అయితే ఇంకా నదీ గర్భంలో దాదాపు 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు తేల్చారు. 

Also Read:  టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి.. దీని వెనుక సజ్జల హస్తం ఉందా?

రేపటి నుంచి కూల్చివేతలు...

ఇప్పటికే నిర్వాసితులను ఆ ఇళ్ల నుంచి ఖాళీ చేయించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలించారు. ఇంకా వెళ్లని వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించి.. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..రేపటి నుంచి కూల్చివేతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అనంతరం మూసీ బఫర్‌ జోన్‌లో ఉన్న ఇళ్లపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే గూగుల్‌ మ్యాప్‌లను పరిశీలించారు. దాదాపు లక్షకు పైగా ఇళ్లు బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. 

బఫర్‌ జోన్‌లో ఉన్న...

దాదాపు మూసీ పరిధిలో 55 కిలోమీటర్ల మేర వెలసిన నిర్మాణాలను కూల్చివేయనున్నారు. అయితే స్థానికులను ఒప్పించిన తర్వాతే కూల్చివేతలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో నదీగర్భంలో ఇళ్లను కూల్చివేయడంతో పాటు బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు రెడ్‌ మార్క్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:  లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!

ఇందిరమ్మ ఇళ్లు...

తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. వీటిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలో ఈ కమిటీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.

కమిటీల నియామకం..

గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కమిటీల నియామకంపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు తెలిపింది. ఇక కమిటీల నియామకానికి పేర్లను సైతం పంపాలని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించింది. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి సర్పంచ్‌ లేదా పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారని అధికారులు తెలిపారు.

మున్సిపల్‌ వార్డు స్థాయిలో వార్డు కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. ఈ రెండు కమిటీల్లో.. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, గ్రామ, మున్సిపల్‌ వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ముగ్గురిని సభ్యులుగా ఏర్పాటు చేస్తారు. వీరిని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరిగా తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

Also Read:  ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!

 కమిటీల్లో నియమించేవారి పేర్లను ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్లుతోపాటు జిల్లా కలెక్టర్లకు పంపాలని తెలిపింది. వీటికి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆమోద ముద్ర వేయనున్నారు. అనంతరం కమిటీల చైర్మన్లు, కన్వీనర్లు, సభ్యులకు ఈ పథకం అమలుపై అవగాహన తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సహాయంగా ఉండడంతో పాటు సోషల్‌ ఆడిట్‌ను ఈ కమిటీలు నిర్వహిస్తాయి. అర్హులకు ఇల్లు అందకపోవడం, అలాగే అనర్హులకు దక్కడం లాంటివి ఏమైనా జరిగితే.. ఆ వివరాలను ఎంపీడీవోలకు, మున్సిపల్‌ కమిషనర్లకు తెలియజేయడంలో కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి.

Also Read:  కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్‌ డౌటే

#hyderabad #musi-river #demolition
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe