Cricket: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్‌ డౌటే

మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది. 

New Update
cricket

India Vs Australia T20 World Cup: 

దుబాయ్‌లో జరుగుతున్న విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఈరోజు టీమ్ ఇండియా కీలక మ్యాచ్‌లో ఓటమి పాలయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ (29), షఫాలీ వర్మ (20) మాత్రమే కాస్త పరుగులును చేయగలిగారు.   ప్రస్తుతం టీమ్‌ ఇండియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. రేపటి మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్‌ గెలిస్తే ఆ జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే రన్‌రేట్‌ ఆధారంగా భారత్‌కు సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. 

అంతకు ముందు ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వరుసవిజయాలతో ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. ఈరోజ మ్యాచ్ కూడా అదే ఊపుతో ఆడింది ఆ టీమ్. అయితే ఈరోజు మహిళల భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు కాస్త ఆస్ట్రేలియా బ్యాటర్ల జోరు కాస్త తగ్గింది. సకాలంలో వికెట్లు తీయడం వలన అస్ట్రేలియా మరీ అంత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయలిగారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 151 పరుగులు చేసింది. ఓపెనర్‌ గ్రేస్‌ హారిస్‌ (40), తాహిలా మెక్‌ గ్రాత్‌ (32), పెర్రీ (32) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

Also Read: గుజరాత్‌లో 5వేల కోట్ల డ్రగ్స్ సీజ్

Advertisment
తాజా కథనాలు