Sangareddy:
సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కొండాపూర్ (మం) మల్కాపూర్‌లో భారీ భవనాన్ని కూల్చివేశారు. చెరువు స్థలంలో కొందరు వ్యక్తులు భారీ భవనాన్ని నిర్మించారు. అక్రమ నిర్మాణంపై గ్రామస్తుల ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు... ఉదయం నుంచి కూల్చివేతలు షురూ చేశారు. బాంబులు పెట్టి ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. నిన్న అమీన్పూర్లో వివాదాస్పద స్థలాల్లో అధికారుల సర్వే చేసి ఈరోజు కూల్చివేతలను ప్రారంభించారు.
Also Read : కంగనాకు భారీ ఊరట.. 'ఎమర్జెన్సీ' విడుదలకు గ్రీన్ సిగ్నల్