గత కొద్ది రోజులుగా తాను తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ తాను తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించడం లేదని.. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాంచందర్‌రావు మంచి రైటర్
బీజేపీ హై కమాండ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి తన రాజీనామా ఆమోదించేలా చేశారని రాజాసింగ్ ఆరోపించారు. రాంచందర్‌రావు మంచి రైటర్ కానీ ఫైటర్ కాదన్నారు. తెలంగాణ బీజేపీకి ఫైటర్ కావాలఅని వ్యాఖ్యానించారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిస్తే మళ్లీ పిలుస్తామన్నారని రాజాసింగ్ వీడియోలో వెల్లడించారు. ఇక తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని వివరించారు.
కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక విషయంలో అసంతృప్తితో రాజాసింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేశానని ప్రకటించారు. జులై 11, 2025న బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత, ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.
MLA Rajasingh : అమిత్ షాతో భేటీ... రాజాసింగ్ సంచలన వీడియో!
గత కొద్ది రోజులుగా తాను తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.