USA: నాసా ఛీఫ్‌గా బిలయనీర్ జేర్డ్ ఐజాక్ మెన్

యూఎస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిసట్రేషన్ అయిన నాసా ఛీఫ్ గా ఎలాన్ మస్క్ డియర్ ఫ్రెండ్ నుఎంపిక చేశారు. ఈ పదవికి జేర్డ్ ఐజా మెన్‌ను నామినేట్ చేస్తూ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

New Update
nasa

 జేర్డ్ ఐజాక్ మెన్ పెన్సిల్వేనియాకు చెందిన పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ షిఫ్ట్ 4 వ్యవస్థాపకుడు. ఇతనికి 41 ఏళ్ళు. ఎలాన్ మస్క్‌కు చాలా మంచి ఫ్రెండ్. కమర్షియల్ స్పేస్ X మిషన్ లో భాగంగా ఐజాక్ మెన్  రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అయితే ఇతను నాసాలో ఎప్పుడూ కూడా పనిచేయలేదు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 1.9 బిలియన్ డాలర్ల సంపదతో ఐజాక్ మెన్  ప్రపంచ బిలియనీర్ గా ఉన్నారు. ఇపుడు ఇతనినే నాసాకు ఛీఫ్‌గా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేస్తూ ప్రకటించారు. 

11

ఇతనో వ్యోమగామి..

ప్రస్తుతం నాసా ఛీఫ్‌ అడ్మినిస్ట్రేటర్ గా బిల్ నెల్సన్ ఉన్నారు. ఈయన 2021 నుంచి ఈ పదవిలో ఉన్నారు.  నెల్సన్ ఫ్లోరిడా నుంచి సెనెటర్ గా , 1979 నుంచి 1991 వరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యునిగా ఉన్నారు. ఇక నాసా చీఫ్ గా ఐజాక్ మెన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చంద్రునిపైకి మానవుల రవాణా వంటి కీలక మిషన్లను చేపట్టనుంది. ఇందులో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్‌తో కలిపి ప్రాజెక్టులు చేపట్టనున్నారు. చంద్రునిపై అన్వేషణలో చైనా తో పోటీ పడుతున్న అమెరికా పెరుగుతున్న పోటీని తట్టుకొని పురోగమించేందుకు ఐజాన్ మెన్ కృషి చేయనున్నారు. 

 

Also Read: Russia: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడతాం–పుతిన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు