Telangana Assembly : హరీష్ రావు సిగ్గుండాలి నీకు..  మంత్రి ఉత్తమ్ ఫైర్ !

అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే సిగ్గులేకుండా హరీష్ రావు అసెంబ్లీలో నవ్వుకుంటూ ఉంటున్నాడని మంత్రి ఉత్తమ్ అన్నారు.

New Update
harish rao

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే సిగ్గులేకుండా హరీష్ రావు అసెంబ్లీలో నవ్వుకుంటూ ఉంటున్నాడని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతుండగా హరీష్‌రావు తనకు మాట్లాడేందుకు రెండు గంటల సమయం ఇవ్వాలని కోరగా స్పీకర్ అరగంట సమయం ఇచ్చారు. 650పేజీలపై అరగంటలో ఎలా సమాధానం చెప్పాలని హరీష్‌ ప్రశ్నించారు.  ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిందన్నారు మంత్రి ఉత్తమ్ . 20 నెలలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు