Minister Ponguleti : కొడుకుపై కేసు పెట్టినందుకు మంత్రి పొంగులేటి ప్రతీకారం..గచ్చిబౌలి సీఐ పై వేటు ?

రూల్‌ బుక్‌ పట్టుకుని, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కేసు నమోదు చేసినందుకు హబీబుల్లాఖాన్‌ను బదిలీ చేయడం సంచలనంగా మారింది.

New Update
FotoJet - 2025-12-11T132025.690

Minister Ponguleti's revenge for filing a case against his son.

Minister Ponguleti : రూల్‌ బుక్‌ పట్టుకుని, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర మంత్రి, ప్రభుత్వంలో నెంబర్‌ - 2 అని చెప్పుకుంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షా రెడ్డిపై రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా  కేసు నమోదు చేశారు గచ్చిబౌలి SHO మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌. ఐతే కేసు నమోదు చేసినందుకు హబీబుల్లాఖాన్‌కు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఏంటంటే..బదిలీ . సమాజంలో నిజాయితీగా పని చేసే అధికారులు ఎందుకు కనిపించకుండా పోతున్నారో ఈ విషయం మరోసారి నిరూపించింది. 



ఇటీవల పొంగులేటి హర్షపై నమోదైన కేసు గురించి మంత్రి పొంగులేటిని మీడియా ప్రశ్నించగా..ప్రజా ప్రభుత్వంలో చట్టం ముందు తన కొడుకుతో పాటు అందరూ సమానమేనని, ఎవరూ మినహాయింపు కాదన్నారు పొంగులేటి. కానీ, ఇంతలోనే కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ను వెకెన్సీ రిజర్వ్‌ పేరుతో బదిలీ చేశారు.  ఈ వ్యవహారంతో చట్టం ముందు అందరూ సమానమేనంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్య ఓ సెటైర్‌గా మిగిలిపోయింది. అంటే మాటల్లో మాత్రమే చట్టం ముందు అందరూ సమానం. వాస్తవంలోకి వస్తే న్యాయంగా నడుచుకున్న అధికారులకు సైతం శిక్ష తప్పదనడానికి ఈ ఘటనే ఉదహరణ.

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లా ఖాన్‌ ట్రాక్ రికార్డు ఒకసారి పరిశీలిస్తే. హబీబుల్లా స్వస్థలం మహబూబ్‌నగర్‌. మొదట హైదరాబాద్ ఓల్డ్‌ సిటీ, తర్వాత కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ - (DI)గా పని చేశారు. తర్వాత కాచిగూడ CI గా ప్రమోషన్ లభించింది. ఆ సమయంలో 85 ఏళ్ల వృద్ధురాలి మర్డర్ కేసును కేవలం 48 గంటల్లోనే చేధించి హంతకులను పట్టుకున్నారు. తర్వాత గచ్చిబౌలి స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఇటీవలే హబీబుల్లా పనితీరును మెచ్చుకున్న ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విభాగంలో అవార్డును సైతం ప్రకటించింది. IPS ఆఫీసర్‌ శిఖా గోయల్ చేతుల మీదుగా...సురక్షిత్ హైదరాబాద్‌..అవార్డును సైతం అందుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో క్రమశిక్షణ, నిజాయితీగా పని చేశారు హబీబుల్లా ఖాన్. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రూల్‌ బుక్‌ను మాత్రమే నమ్మారు. హబీబుల్లా ఖాన్‌కు డిపార్ట్‌మెంట్‌లో మంచి గుర్తింపు ఉంది.  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ పరిధిలోనూ పలు కేసులను చేధించి ఐటీ కారిడార్‌లో సెక్యూరిటీని మరింత బలోపేతం చేశారు. 
 
గచ్చిబౌలి CIగా హబీబుల్లా ఖాన్‌ సాధించిన విజయాలివే

- ల్యాండ్ గ్రాబ్బింగ్ కేసులు - రాజకీయ పలుకుబడి ఉన్న నేతల ఒత్తిళ్లను పట్టించుకోకుండా పలు భూకబ్జా కేసులు నమోదు
- నకిలీ క్యాబ్ & ఫ్రాడ్ రాకెట్లు: IT కారిడార్‌లో క్యాబ్, రిక్రూట్మెంట్, ఆన్‌లైన్ ఫ్రాడ్ గ్యాంగ్‌లను అడ్డుకోవడం
- చోరీల కేసుల ఛేదన: బైక్ లిఫ్టింగ్, ల్యాప్‌టాప్ చోరీలు, కార్పొరేట్ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలను వేగంగా ఛేదించడం
- సైబర్ భద్రత: IT ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక అవేర్‌నెస్ డ్రైవ్స్, సైబర్ క్రైమ్ సమన్వయం
 
అవార్డులు & అధికారిక ప్రశంసలు

సైబరాబాద్ మేరియట్ అవార్డు: అత్యుత్తమ క్రమశిక్షణ ఫీల్డ్ పనితీరుకు గుర్తింపుగా హబీబుల్లా ఖాన్‌ అవార్డు అందుకున్నారు. అంతేకాదు పలు కేసుల్లో వేగంగా దర్యాప్తు చేసి చేధించడం, సిబ్బందిని సమన్వయం చేసుకోవడంలో హబీబుల్లా ఖాన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందుకు ఆయన కమిషనర్‌ నుంచి ప్రశంసా పత్రాలు సైతం అందుకున్నారు. 

వివాదాస్పద బదిలీ… కారణమేంటి?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై భూకబ్జా కేసు నమోదు చేసిన 2-3 రోజుల వ్యవధిలోనే ఆయన బదిలీ కావడం వివాదాస్పదమైంది. మంత్రి కొడుకుపై కేసు నమోదు చేసినందుకే హబీబుల్లా ఖాన్‌ను బదిలీ పేరుతో బలి చేశారని ప్రధాన ప్రతిపక్షం BRS ఆరోపిస్తోంది.  సక్రమంగా విధులు నిర్వర్తించిన అధికారులే శిక్షలు అనుభవిస్తుంటే న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్న ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు