Minister Ponguleti: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుస్తాం అని ఆయన అన్నారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరని హెచ్చరించారు. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ రెడీగా ఉన్నాయని అన్నారు. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే యాక్షన్ అని చెప్పారు.
ఇది కూడా చదవండి: షర్మిల సంచలన నిర్ణయం!
ఇటీవల తెలంగాణలో రచ్చ లేపిన ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పొంగులేటి కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్‌ఎస్ ప్రధాన నేతలపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?,
కేసీఆర్, కేటీఆర్‌పైనే గురి పెట్టారా?.. హరీష్ స్కామ్‌లు బయపెట్టబోతున్నారా? అని అనేక ప్రశ్నలకు తెర లేపుతున్నాయి. కాగా అసలేం జరుగుతోందో మరికొన్ని రోజుల్లో చూడాలి.
Also Read : మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ.. 'అమరన్' ట్రైలర్ చూశారా
అందరు జైళ్లకే...
గత ప్రభుత్వ హయాంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధం చేశామని అన్నారు పొంగులేటి. నెంబర్ ఒకటి నుంచి ఎనిమిది మంది ముఖ్యలు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తమ దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయని.. ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇది ఏ మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలు కావని అన్నారు. తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించాలని అన్నారు. అందుకే గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్స్ వంటిపై వాటిపై విచారణ పక్కాగా జరుగుతుందని చెప్పారు. దోషులు తప్పించుకోకుండా ఉండేందుకు అన్ని అధరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని.. అందుకే విచారణ కొంచెం లెట్ అయిందని అన్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణలో సంచలనం జరగబోతోందని అన్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీశాయి.
Also Read : ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
డైవర్షన్ పాలిటిక్స్?...
కాగా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మూసీ నిర్వాసితుల ఆందోళన, హైడ్రా అంశం, రైతు రుణమాఫీ, రైతు భరోసా.. ఇచ్చిన హామీల అమలు వంటి వాటిపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనే చర్చ నెలకొంది. మరోవైపు నిన్న ప్రియాంక గాంధీ నామినేషన్ లో వాడిన హెలికాఫ్టర్ తెలంగాణ ప్రభుత్వానిది అని.. తెలంగాణ సొమ్ము ఎవరి పాలైంది అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేశాయి. కాగా వీటన్నిటి నుంచి ప్రజలకు డైవర్ట్ చేసేందుకే మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారనేది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.
Also Read : కమీషన్లు మింగేశారా..?..కాళేశ్వరంపై ఓపెన్ కోర్టులో విచారణ