చికిత్స పొందుతూ విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

హైదరాబాద్‌లో KPHBలోని వరుణ్ తేజ్‌(23) అనే అబ్బాయి కడుపులో మంటగా ఉందని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. గురువారం అతడికి శస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ అబ్బాయి చనిపోయాడని అతని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

New Update
Death

హైదరాబాద్‌లోని KPHBలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ అబ్బాయి చనిపోయాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వరణ్‌తేజ్‌ (23) కడుపులో మంటగా ఉందని KPHB రోడ్‌ నెం.1లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అపెండిసైటిస్‌గా గుర్తించారు. 

Also Read: 30 రోజుల్లో హెల్త్ కార్డులు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి!

అయితే గురువారం ఉదయం శస్త్ర చికిత్స చేస్తుండగానే వరుణ్‌తేజ్‌ మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వరుణ్ చనిపోయాడని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చివరికి సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు