తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నర్సింగ్ ఆఫీసర్లు- 272 పోస్టులు, ఫార్మాసిస్ట్ - 99 పోస్టులున్నాయి.

New Update
Medical Department

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో వైద్యారోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నర్సింగ్ ఆఫీసర్లు- 272 పోస్టులు, ఫార్మాసిస్ట్ - 99 పోస్టులున్నాయి.

చివరి తేదీ, పరీక్ష తేదీలు

గత నెలలో రిలీజ్ అయిన ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా దీనిని విడుదల చేసినట్లు బోర్డు పేర్కొంది. కాగా గత నెలలో మొత్తం 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: తెలంగాణ డీఎస్పీగా ఇండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే!?

ఇప్పుడు దానికి అదనంగా మరో 272 పోస్టులను జత చేశారు. దీంతో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 2,322కు చేరాయి. అదే విధంగా గత నెలలో 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి అదనంగా ఇప్పుడ మరో 99 పోస్టులను జత చేశారు. దీంతో మొత్తం ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కు చేరింది. 

ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ

అయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అక్టోబర్ 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 17వ తేదీన ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. అదే సమయంలో ఫార్మసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. దీనికి నవంబర్ 30వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు