Telangana: సంగారెడ్డిలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు
సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భూమి కంపించడం కలకలం రేపింది. న్యాల్కర్, ముంగి గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు
మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.
బీసీ జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని పేర్కొన్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని అన్నారు కేసీఆర్. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రజల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.
సర్పంచ్ల పదవీకాలం గడవు పొడిగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచ్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. ఇటీవల రైతు బంధు నిధులను ఈ నెలలోనే రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు నిధులు FEB నెలాఖరుకు జమ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది.