BB Patil: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కారు దిగి కాషాయ జెండా కప్పుకున్నారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కారు దిగి కాషాయ జెండా కప్పుకున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసే ఆలోచలనలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించినచోటే మరో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు వెళ్తున్న కారు కంట్రలోతప్పి పల్టీలు కొట్టడంతో ఒకరు మరణించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియాల్సివుంది.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదు.
కాంగ్రెస్‌పై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ నిర్ణయంపై ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీజేపీ 10కిపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. విజయసంకల్ప యాత్రలో భాగంగా గజ్వేల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ అధికారంలోనే 2జి స్పెక్ట్రమ్, కోల్ మైన్, ఫెర్టిలైజర్ స్కామ్స్ జరిగాయని విమర్శించారు.
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిన కవిత రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ లీగల్ అడ్వైస్ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని అన్నారు. సింపతితో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆరోపించారు.
60 ఏళ్లకు వచ్చే గుండెజబ్బులు..20 ఏళ్లు నిండకముందే వస్తున్నాయి. పెద్దలనే కాదు చిన్నపిల్లలను కూడా బలితీసుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోతుగల్ గ్రామానికి చెందిన చందు (19) గుండెపోటుతో మరణించాడు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లి గుండెపోటుతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.