ఎస్సై, లేడీ కానిస్టేబుల్ డెత్ మిస్టరీ.. వాట్సాప్ చాటింగ్ లో సంచలన విషయాలు!

ఎస్సై, లేడీ కానిస్టేబుల్, ఆపరేటర్ డెత్ మిస్టరీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే వీరి చావులకు కారణమని తెలుస్తోంది. గత వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

New Update

అయితే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో కొంతకాలంగా శృతి ప్రేమలో ఉన్నారట. మరో వైపు అదే సమయంలో స్టేషన్ కొత్త ఎస్సైగా  వచ్చిన సాయికుమార్ కి శృతితో పరిచయం పెరిగిందట. దీంతో  ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్‌కు మధ్య గొడవ  జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత   ఈ విషయమై ముగ్గురు మాట్లాడుకునేందుకు ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు వెళ్లగా .. అక్కడ ముగ్గురి మధ్య వాగ్వాదం పెరగడంతో ముందుగా నిఖిల్, శృతి చెరువులో దూకగా.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఎస్సై కూడా సూసైడ్ చేసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు గత వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు,  వాట్సాప్ చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురి  కేసు విచారణకు ప్రత్యేక బృందాలుగా  ఏర్పడిన పోలీసులు సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఎస్సై భార్య ప్రస్తుతం పుట్టింట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో శృతి వ్యవహారం ఎస్సై భార్యకు ముందే తెలుసా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అటు కానిస్టేబుల్ శ్రుతికి కూడా ఇప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. 

Also Read: Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు