Sangareddy : సంగారెడ్డి  పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన జనం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  హత్నూర మండలం బోరపట్ల గ్రామ సమీపంలో ఉన్న అపిటోరియా యూనిట్ వన్ పరిశ్రమలోని ఈటీపీ ప్లాంట్‌లో శనివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

New Update
FotoJet - 2025-11-09T120245.143

Massive fire breaks out in Sangareddy industrial area

Sangareddy : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  హత్నూర మండలం బోరపట్ల గ్రామ సమీపంలో ఉన్న అపిటోరియా యూనిట్ వన్ పరిశ్రమలోని ఈటీపీ ప్లాంట్‌లో శనివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగి  పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ప్లాంట్‌లో రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రం సమీపంలో ఒక్కసారిగా స్పార్క్ రావడంతో మంటలు చెలరేగాయని, కొన్ని నిమిషాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చాయని తెలిపారు. స్థానిక గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, హుటహుటినా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించింది. అప్పటికే ఈటీపీ ప్లాట్ పూర్తిగా కాలిపోయింది.
 
కాగా ఈ అగ్ని ప్రమాదంలో భారీగా రసాయన పదార్థాలు దగ్ధమయ్యాయి. దాంతో వాతావరణంలో దుర్వాసన వ్యాపించి, ప్రజలు అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయమై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మునుపు కూడా ఈ ప్లాంట్‌లో భద్రతా చర్యలు తీసుకోవడం లేవని అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ నిర్లక్ష్యం ఫలితంగా ఆ ప్రమాదం జరిగింది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం పరిశ్రమ ప్రాంగణంలో పోలీసులు, పర్యావరణ శాఖ అధికారులు పరిశీలనలు కరువు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను వెలికితీయడానికి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయకపోవడం, రసాయన వ్యర్థాల నిల్వలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. “ప్రతి సారి ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు కదిలి వస్తారు. ముందుగా తనిఖీలు జరిపి ఇలాంటి సంఘటనలు నివారిండం లేదు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. సమగ్ర విచారణ జరిపి ప్రమాదపై నిజనిజాలు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు