PM Modi Telangana Tour: మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.
ఒకప్పుడు వలసల జిల్లా, వెనకబడిన జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వందే భారత్ రైలు పరుగులు పెట్టడం జిల్లా ప్రజల అదృష్టం అని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలోనే మహబూబ్ నగర్ కు డబ్లింగ్ లైన్ పూర్తి చేసిన రైల్వే శాఖ.. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సుందరీకరణ కు కూడా కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇస్తామన్న హామీతో ఆయన హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు.
ప్రపంచం గర్వపడేలా చంద్రాయన్-3 సక్సెస్ చేశారు మనదేశ శాస్త్రవేత్తలు. అయితే, వినూత్న రీతిలో చంద్రయాన్ 3 సెటప్ ను కళ్ళకు అద్దం పట్టినట్టుగా చిత్రీకరించారు గద్వాల చేనేత సంఘం నాయకులు. ప్రజలందరూ ఆకర్షించేలా గణపతి మండపం ఏర్పాటు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నగణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి నాగర్ కర్నూలు జిల్లా ఆవంచలో కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడి వినాయకుని భక్తులు ఐశ్వర్య గణపతి గా పిలుస్తూ ఉంటారు. 25 అడుగుల ఎత్తు 17 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆవంచ గణపతికి గుండు గణపతి గా కూడా పేరు ఉంది. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం 12వ శతాబ్దం నాటిదిగా చరిత్ర చెబుతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం మంగనురు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కర్కషత్వం చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. మద్యానికి బానిసై..అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణంగానే పిల్లలను చంపింది అని లలితపై ఆరోపిస్తున్నారు భర్త శరవంద కుటుంబ సభ్యులు.