Jithender Reddy: బీజేపీకి బిగ్ షాక్.. జితేందర్ రెడ్డి రాజీనామా
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తనకు ఎంపీ టికెట్ రాకపోవడంతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తనకు ఎంపీ టికెట్ రాకపోవడంతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.
పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
బీజేపీకి తెలంగాణలో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీజేపీ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.
ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది.
కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు బీజేపీతో జతకట్టిన బీఆర్ఎస్ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ మిగలరని అన్నారు.
యాదాద్రిలో ఉపముఖ్యమంత్రి భట్టిపట్ల సీఎం రేవంత్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం ఎత్తైన పీటలమీద కూర్చొని భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యం. వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముణుగూరు వేదికగా సీఎం రేవంత్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. ఖమ్మం ప్రజలు కేసీఆర్ ను నమ్మరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విషయంలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పూజ సమయంలో అందరూ పెద్ద పీటలపై కూర్చొని భట్టిని చిన్న పీటపై కూర్చోబెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు ఇది అవమానమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.