పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని మనస్తాపంతో.. ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన సాయికుమార్ చెట్టుకు ఉరేసుకోగా.. ప్రియురాలు వీణ ఇంట్లో దులానికి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

New Update
వరుసగా విద్యార్థినిల సూసైడ్స్, ఆందోళనలో పేరెంట్స్!

కామారెడ్డి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీబీపేట్ మండంలోని కోనాపూర్‌లో ఉంటున్న సాయికుమార్, అంబారీ పేట గ్రామానికి చెందిన వీణ కొన్ని రోజుల నుంచి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. భయపడి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పలేకపోయారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భయపడి మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్యకి పాల్పడ్డారు. 

తన గ్రామం చివర్లో పొలాల దగ్గర ఉన్న చెట్టుకు సాయి కుమార్ ఉరేసుకుని చనిపోగా.. ప్రియురాలు వీణ దులానికి ఉరేసుకుని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఇరు కుటుంబాలతో పాటు రెండు గ్రామాలు కూడా విషాదంలో మునిగిపోయాయి. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పంపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు