Telangana Liquor Rates: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 20శాతం పెరగనున్న ధరలు

తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్ ఇది. ఇప్పటికే బీర్ల ధరలు పెరిగి లబోదిబో అంటోన్న మద్యం ప్రియులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలో మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. రూ.10 నుంచి రూ.20 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
 wine shop

wine shop

Telangana Liquor Rates: తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్ ఇది. ఇప్పటికే బీర్ల ధరలు(Telangana Beer Rates) పెరిగి లబోదిబో అంటోన్న మద్యం ప్రియులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలో మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే గత బీఆర్ఎస్ హయాం నుంచి గడచిన నాలుగేళ్లుగా మద్యం ధరలు పెరగలేదు. దీంతో సదరు మద్యం కంపెనీలు మద్యం ధరలు పెంచాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయి. నిజానికి గడచిన ఆరునెలలగా ప్రభుత్వంపై ఆ కంపెనీలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయితే మద్యం పెంపకాలపై ప్రభుత్వం  హైకోర్టు మాజీ న్యాయమూర్తి తో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలిసారి జూలై 18వ తేదీన సమావేశమైంది. జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్‌ చేయాలని సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ తర్వాతి రోజే సీల్డ్‌ కవర్లు తెరిచి కంపెనీలు కోట్‌ చేసిన ధరలను కమిటీ చూసింది. 

Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!

ధరలు పెంచాలని మద్యం కంపెనీల డిమాండ్ 

మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాండీ, విస్కీ, రమ్‌, వైన్‌, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్‌ చేశాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్‌ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్‌ కంపెనీలు కూడా ఉన్నాయి.అయితే మద్యం మార్కెట్‌లో దాదాపు 60 శాతం వాటా ఉన్న యూబీ బీర్ల కంపెనీ.. తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్‌ ధర మీద కనీసం 33 శాతం అదనంగా చెల్లించాలని కోట్‌ చేసింది. ఇదే డిమాండ్‌ను ఇతర కంపెనీలు చేస్తున్నాయి. అయితే 2023లోనే బేసిక్‌ ధర పెంచాలని మద్యం కంపెనీలు కోరగా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పటికే మద్యం ధరల పెంపునకు సంబంధించి రూ.10 నుంచి రూ.20 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

15 నుంచి 20 శాతానికి పెంపు...

బీరు ధరలు పెంచిన  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్‌, వైన్‌, విదేశీ స్కాచ్‌ (ఐఎఫ్‌ఎమ్‌ఎల్‌) మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధరల నిర్ణయ కమిటీ మద్యం ధరలను 15 శాతం నుంచి 20 శాతం మేరకు పెంచవచ్చని సూచిస్తూ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. 180 ఎంఎల్‌ ఉండే క్వార్టర్‌ చీప్‌ లిక్కర్‌ ధర రూ.110 ఉంది. దీనిపై మరో రూ.20 వరకు పెరిగే అవకాశముంది.చీప్‌లిక్కర్‌ మొదలుకొని మీడియం, ప్రీమి యం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచటానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. కసరత్తు చేసిన ప్రైస్‌ ఫిక్సేషన్‌ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచవచ్చని నివేదిక రూపొందించినట్టు సమాచారం. త్వరలోనే మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలిసింది.

Also Read: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు