Lady Aghori: తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ నాగసాధువు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మహిళా అఘోరీ అక్టోబర్ అక్టోబర్ 29న ఈ మహిళా అఘోరీ సంచలన ప్రకటన చేసింది. సనాతన ధర్మంపై పోరాటంలో తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పింది. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రశ్నించింది.
Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో ముందస్తు జాగ్రత్తగా అఘోరీని ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సిద్దిపేటలో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎస్కాట్ మధ్య అఘోరీని మంచిర్యాల జిల్లాలోని తన స్వగ్రామమైన కుషనపల్లికి తీసుకెళ్లి.. తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
Also Read : యష్మీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ..
మహిళా అఘోరీ
ఈ మహిళా అఘోరీ తెలంగాణలోని పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే.. కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో పూజలు చేసింది. అక్కడ పూజలు చేస్తున్న సమయంలో నగ్నంగా ఉన్నఈ మహిళా అఘోరిని చూసి భక్తులు షాకయ్యారు. నిన్న కొండగట్టలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుంది. తర్వాత అఘోరీ వేములవాడ, కొమురవెల్లి ఆలయాలకు కూడా వెళ్లనున్నట్లు తెలిపింది.
Also Read: 'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. హిట్టా? ఫట్టా ? ఈ ఒక్క రివ్యూ చూస్తే చాలు
Also Read: యువరాణిలా ముస్తాబైన నటి.. కేతిక శర్మని ఇలా చూస్తే అంతే సంగతి!