KTR ఇలాకాలో BRS క్లీన్ స్వీప్.. సిరిసిల్లలో గులాబీ జెండా రెపరెపలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డా రాజన్న సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్వీన్ స్వీప్ దిశగా ఉన్నాయి. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులకు గానూ, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి దశలోనే బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

New Update
KTR Padayathra

KTR Padayathra

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డా రాజన్న సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్వీన్ స్వీప్ దిశగా ఉన్నాయి. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులకు గానూ, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి దశలోనే బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పటివరకు వెలువడిన తొలి 14 వార్డుల ఫలితాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే విజయభేరి మోగించారు. అంటే, లెక్కింపు జరిగిన ప్రతి వార్డులోనూ కారు గుర్తు అభ్యర్థులే విజయం సాధించడం విశేషం.

మరోవైపు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఇంకా తమ ఖాతాలను తెరవలేకపోయాయి. కేటీఆర్ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులే ఈ విజయానికి కారణమని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. లెక్కింపు కొనసాగుతున్న తరుణంలో, మిగిలిన వార్డుల్లో కూడా బీఆర్ఎస్ విజయం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ఓటర్లు కారు గుర్తుకే పట్టం కట్టడంతో సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం కావడం లాంఛనంగా మారింది.

Advertisment
తాజా కథనాలు