కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన బయటకు వచ్చారు. దీంతో ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ ఉండదని తేలిపోయింది. విచారణ తర్వాత ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు విచారణకు పిలిచాన వస్తానన్నానన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4-5 ప్రశ్నలనే అటు తిప్పి, ఇటి తిప్పి అడిగారని ఆరోపించారు. ఇదో అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి కేటీఆర్ విచారణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం pic.twitter.com/4VZxdDGdyd — Telugu Scribe (@TeluguScribe) January 9, 2025