/rtv/media/media_files/2025/03/26/KyytuDHWBpJklhiF1fw4.jpg)
komatireddy-r-gopal
హోంశాఖ అంటే తనకు ఇష్టమని తాను అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు హోంశాఖ అయితే బాగుంటుందని తన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లుగా మీడియాతో చెప్పాను అంతే కానీ తనకు హోంశాఖ కావాలని కోరలేదన్నారు. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. అధిష్టానం తనను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఏ శాఖ అప్పగించినా పనిచేస్తా
మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని.. ఈరోజు అసెంబ్లీలో కొంతమంది మీడియా మిత్రులు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, శాఖల కేటాయింపు ఎలా ఉంటుందని విషయంలో చిట్ చాట్ చేసిన సందర్భంలో చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు, అభిమానులు నాకు హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని, అంతేతప్ప నాకు హోం శాఖ ఇవ్వాలి, హోం మంత్రి అయితేనే బాగుంటుంది అనే విషయాలు మీడియా మిత్రుల వద్ద చర్చకు రాలేదు.. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్... అధిష్టానం నన్ను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేసి ఇటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి, అటు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి అహర్నిశలు పాటుపడుతూనే ఉంటా అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
PRESS NOTE -
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) March 25, 2025
మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని.. ఈరోజు అసెంబ్లీలో కొంతమంది మీడియా మిత్రులు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, శాఖల కేటాయింపు ఎలా ఉంటుందని విషయంలో చిట్ చాట్ చేసిన సందర్భంలో…
Also Read : ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?