ఇదో పెద్ద జోక్.. అది చేతగాకే కేటీఆర్ కొత్త నాటకం: కోమటిరెడ్డి ఫైర్ కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్ధపు పెద్ద జోక్ గా పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు. By srinivas 12 Nov 2024 | నవీకరించబడింది పై 12 Nov 2024 20:09 IST in తెలంగాణ నల్గొండ New Update షేర్ చేయండి Komati reddy: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అయినా కేటీఆర్ ను ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారని వెళ్లాడో అర్థం కావట్లేదంటూ విమర్శలు గుప్పించారు. మంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు మోడీలేడు, బోడీ లేడని చెప్పిన కేటీఆర్ కు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొంచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపట్ల కేటీఆర్ లో వచ్చిన మార్పు పెద్ద జోక్ అంటూ సెటైర్స్ వేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలవడానికి చేతగాని కేటీఆర్.. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు. ఢిల్లీ టూర్ పెద్ద డైవర్షన్ పాలిటిక్స్.. ఆర్ఆర్ఆర్ మంజూరీ అయి సంవత్సరాలు గడిచినా గడ్కరీని ఎందుకు కలవలేదు. ఎందుకు పనులు ప్రారంభించాలని అడగలేదు. కేటీఆర్ ఢిల్లీ టూర్ పెద్ద డైవర్షన్ పాలిటిక్స్. ఫార్మూల్1 రేస్ లో రూ. 50 కోట్ల రూపాయలు ఓరల్ ఇన్ స్ట్రక్షన్ తో ఇవ్వడంమీద ఏసీబీ కేసు బుక్ చేసేందుకు గవర్నర్ ప్రసిక్యూషన్ కు అనుమతించాడనే భయంతోనే ఢిల్లీకి వెళ్లాడు. కేటీఆర్ ఫెమా, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూపాయలను.. డాలర్లుగా మార్చి కన్సల్టెన్సీల కడుపు నింపిండు. హైదరాబాద్ పేరు చెప్పి అడ్డంగా దోపిడికి తెరతీసిన దోపిడిరావు కేటీఆర్. కేటీఆర్ తెచ్చింది ఒరిజినల్ ఫార్మూల-1 కాదు. పెద్ద డూప్లీకేట్. అమృత్-2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్ధపు పెద్ద జోక్. సుజన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి తోక చుట్టం. కానీ కల్వకుంట్ల కవితకు దశాబ్ధానికిపైగా బిజినెస్ పార్ట్ నర్ అని గుర్తు చేశారు. కేటీఆర్ జవాబు చెప్పాలి.. ఇక కవితా, సుజన్ రెడ్డి ఇద్దరూ బిజినెస్ పార్ట్ నర్స్. ఇరిగేషన్ టన్నెల్ పనులు చేసిందివారే. దానికి కేటీఆర్ జవాబు చెప్పాలి. అమృత్ టెండర్లు మా ప్రభుత్వం వచ్చే వరకే టెండర్ పూర్తయ్యే దశలో ఉన్నాయి. తేజారాజుకు చెందిన గజా కన్ స్ట్రక్షన్ కు అమృత్ -1 టెండర్లు ఇచ్చిందేవరు. కేటీఆర్ కాదా? ప్రతిమా శ్రీనివాసరాజుకు అమృత్ -1 టెండర్లు ఇచ్చిందేవరు. మెగా కంపెనీకి టెండర్లు ఇచ్చిందెవరూ కేసిఆర్ కాదా? అమృత్-2 టెండర్లను క్యాన్సిల్ చేస్తే.. రీటెండర్ పిలిచి రివైజ్డ్ రేట్లు కావాలంటే సీఎంతో మాట్లాడి క్యాన్సిల్ చేసింది. 21 వేల కోట్ల విలువైన కాళేశ్వరం పనులను హాస్పిటల్ నిర్వహించే ప్రతిమ శ్రీనివాస్ రావుకు ఎట్లిచ్చిండ్రు? రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చేవరకు ఉద్యోగులకు 15 తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పెన్షనర్లకు 15 తారీఖు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: AP: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా కేసుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు..ఇక తమ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో కూడా రూ. 22 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని చెప్పారు. కోట్లమంది అక్కా చెల్లెండ్లను ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేలా చేసినం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చినం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చినం. తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మేధావులకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా సహకరించినందుకు.. తనను ఫార్మూల స్కాం నుంచి తప్పించమని అమిత్ షాను కలవడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను పూర్తిగా సహకరించి గెలిపించినం. 7 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి త్యాగం చేసినం. మమ్మల్ని కేసుల నుంచి కాపాడాలని కేటీఆర్ ఢిల్లీకి పోయిండు.. తప్పితే అమృత్ టెండర్లు గురించి కాదు. అటవీ ప్రాంతంలో, గిరిజనులు, ఆదీవాసీల సంక్షేమం కోసం పనిచేసిన ప్రతీక్ జైన్ పై దాడి బీఆర్ఎస్ మానసిక స్థితికి నిదర్శనమన్నారు. ఇది కూడా చదవండి: JAC: అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు ఏ విచారణకైనా మేం సిద్ధం..ప్రతీక్ పై దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ ను అధికార యంత్రాంగం గుర్తించింది. ఇవ్వాల భూసేకరణ గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. ఆనాడు ఒకేచోట 14 వేల ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరించినప్పుడు ఏం చేసిండు . ఆనాడు మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినం. ఇలా దాడులకు పాల్పడలేదు. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లంటూ డైవర్షన్ పాలిటిక్స్ తప్పా కేటీఆర్ ఢిల్లీ టూర్ లో ఏం ఫయిదా లేదన్నారు. అమృత్ టెండర్లపై ఏ విచారణకైనా మేం సిద్ధంమని కోమటిరెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణకు కేసిఆర్ సిద్ధమా..? దొంగే.. దొంగా అన్నట్టు ఊళ్లమీదపడి తిరిగితే అది ఒప్పయిపోదు. అబద్ధాలు చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ కు రాజకీయ మనుగడ లేదు. తెలంగాణ ప్రజలు వారిని ఎప్పుడో తిరస్కరించారు. అధికారంలో ఉంటే రాళ్లు విసరడం.. అధికారంపోతే కాళ్లు పట్టుకోవడం కేసిఆర్ ఫ్యామిలీకి అలవాటే అంటూ విమర్శించారు. #komati-reddy #ktr #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి