/rtv/media/media_files/2024/11/14/E1lymQzNFS7nGXnYKn3q.jpg)
లగచర్ల రైతులు,పట్నం నరేందర్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి రూ. 50 వేల పూచీకత్తు విధించింది కోర్టు. మిగతా వారికి రూ. 20 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. గత నెల 11న ఫార్మాసిటీ భూ సేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కొందరు రైతులు దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ దాడి వెనుకాల మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుట్ర ఉందని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నవంబర్ 13న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నెల రోజులకు పైగా ఆయన జైలులోనే ఉన్నారు. ఎట్టకేలకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్, చంద్రబాబు మధ్య చిచ్చు పెట్టిన పొంగులేటి, కోమటిరెడ్డి.. సోషల్ మీడియాలో దుమారం!
బీఆర్ఎస్ పోరాటం..
మరో వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లగచర్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. భూసేకరణ నిర్ణయాన్ని రద్దు చేసుకునే వరకు తమ ఆందోళనలు ఆపమని స్పష్టం చేస్తోంది. ఇన్న లగచర్ల అంశంపై నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వెళ్లి నిరసన తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. అనంతరం తెలంగాణ భవన్ లో లగచర్ల రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కొడంగల్ ప్రజల కోసం నిలబడ్డ మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉక్కు మనిషిగా మారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కు తుక్కు చేస్తాడన్నారు.
ఇది కూడా చదవండి: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
భవిష్యత్తులో లగచర్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని.. రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కాడని విమర్శించారు.